Friday, 20 November 2026

Contact Info

  • ADDRESS: Street, City, Country

  • PHONE: +(123) 456 789

  • E-MAIL: your-email@mail.com

  • Home  
  • West godavari: ఈ జిల్లాలో మళ్లీ పూర్వపు రోజులు.. ఎందుకంటే?
- Good Morning Andhra

West godavari: ఈ జిల్లాలో మళ్లీ పూర్వపు రోజులు.. ఎందుకంటే?

West godavari good morning ap పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి డెల్టా ప్రాంతం కావడంతో వరి పంట విస్తృతంగా పండుతుంది. ఈ జిల్లా రాష్ట్రంలో ధాన్య ఉత్పత్తిలో ముందుంది. అదనంగా చేపల పెంపకం, ఆక్వా కల్చర్ పెద్ద ఎత్తున జరుగుతుంది. కొబ్బరి తోటలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించాయి. వ్యవసాయం ఈ జిల్లాకు ప్రధాన ఆర్థిక బలం. పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్ సెగలు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో నిలిచిపోయిన గ్యాస్ సరఫరా కట్టెల పొయ్యిల మీద […]

West godavari good morning ap
పశ్చిమ గోదావరి జిల్లా
గోదావరి డెల్టా ప్రాంతం కావడంతో వరి పంట విస్తృతంగా పండుతుంది.
ఈ జిల్లా రాష్ట్రంలో ధాన్య ఉత్పత్తిలో ముందుంది.
అదనంగా చేపల పెంపకం, ఆక్వా కల్చర్ పెద్ద ఎత్తున జరుగుతుంది.
కొబ్బరి తోటలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించాయి.
వ్యవసాయం ఈ జిల్లాకు ప్రధాన ఆర్థిక బలం.

పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్ సెగలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో నిలిచిపోయిన గ్యాస్ సరఫరా
కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తున్న క్యాటరింగ్ వ్యాపారస్తులు
కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్న వ్యాపారస్తులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు మన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ మరియు క్యాటరింగ్ రంగాలకు తీవ్ర సమస్యగా మారింది. యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో గ్యాస్ సరఫరా అనిశ్చితంగా మారింది. దీంతో జిల్లాలో కమర్షియల్ గ్యాస్ బండ్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో చాలా హోటళ్లు మళ్లీ పాత పద్ధతులైన కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్ వ్యాపారస్తుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సిలిండర్లు దొరకకపోవడంతో కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి కూడా చాలా మంది క్యాటరర్లు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే బుక్ అయిన కార్యక్రమాలను నిర్వహించడానికే వారు కష్టపడుతున్నారు. మొత్తానికి యుద్ధం ఎక్కడో జరుగుతుంటే.. ఆ మంటలు ఇక్కడ సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. ఈ గ్యాస్ కొరత ఇంకెన్నాళ్లు ఉంటుందోనని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *